రామసముద్రంలో ఎమ్మెల్యేచే శ్రీనివాసరావు విగ్రహావిష్కరణ

68చూసినవారు
రామసముద్రం జెడ్పి హైస్కూల్ ముఖద్వారం వద్ద గురువారం స్వాతంత్ర్య సమరయోధులు శ్రీనివాసరావు విగ్రహాన్ని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆవిష్కరించారు. స్వాతంత్ర్య కోసం పోరాడిన యోధులకు ఇలాంటి గుర్తింపు కల్పించి భావితరాలకు అంకితం చేయాలన్నారు. ఒక నెల 16 రోజులు జైలులో ఉన్న శ్రీనివాసరావు సేవల గురించి కొనియాడారు. మాజీ ఎమ్మెల్యే బగ్గీడి గోపాల్, స్వాతంత్ర్య సమరయోధులు శివశంకరయ్య, కామకోటి ప్రసాద్ రావు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్