స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్, రాజంపేట సబ్ కలెక్టర్ ఆధ్వర్యంలో రవాణా, యువజన, క్రీడల శాఖల మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేతుల మీదుగా రైల్వే కోడూరు గ్లోబల్ సర్వీస్ ట్రస్ట్ చైర్మన్ పార్థసారధి ఉత్తమ సేవా ప్రశంసా పత్రము అందుకున్నారు. ఈ అవకాశం ఇచ్చిన కలెక్టరు కు నెహ్రూ యువ కేంద్ర జిల్లా అధికారి మణికంఠ కు, జిల్లా నైపుణ్యాభివృద్ది సంస్థ అధికారి హరికృష్ణ కు కృతజ్ఞతలు తెలిపారు.