చిట్వేలు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా రఘురాం శనివారం బాధ్యతలు స్వీకరించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సాధారణ బదలీలలో భాగంగా పుల్లంపేటలో విధులు నిర్వహిస్తున్న ఆయన చిట్వేలి పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలోని ప్రజలు అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడకుండా శాంతియుతంగా ఉండాలని కోరారు. రహదారులలో తగు జాగ్రత్తలు పాటించి ప్రమాదాలు నివారించాలని కోరారు.