ఉత్సాహంగా ప్రచారంలో పాల్గొంటున్న టిడిపి కార్యకర్తలు

532చూసినవారు
రైల్వే కోడూరు మండలం అనంతరాజు ‌పేట పంచాయతీలో టిడిపి నియోజకవర్గ బాధ్యులు ముక్కా రూపానంద రెడ్డి భార్య వరలక్ష్మి, కోడలు రిషిక రెడ్డి ఆధ్వర్యంలో టిడిపి కార్యకర్తలు ఎన్నికల ప్రచారంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. శనివారం ఉదయం అనంతరాజు పేట గ్రామానికి విచ్చేసిన ముక్కా కుటుంబ సభ్యులకు కూటమి నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు. గ్రామ దేవతకు పూజ అనంతరం ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్