ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 6 నుండి 8వ తేదీ వరకు బాలాలయం జరుగనుందని టిటిడి అధికారులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇందుకోసం సెప్టెంబర్ 6న సాయంత్రం 5. 30 గంటలకు అంకురార్పణ నిర్వహిస్తారు. సాధారణంగా గర్భాలయంలో జీర్ణోద్ధరణ కోసం ''బాలాలయం'' చేపడతారు. ఇందుకోసం ఆలయంలోని మండపంలో నమూనా ఆలయం ఏర్పాటుచేసి గర్భాలయంలోని మూలవర్ల చిత్రపట్టాలను ఏర్పాటు చేస్తారు.