సిద్ధవటం మండలం కణంలోపల్లె వద్ద శ్రావణమాసం సందర్భంగా నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో 108 శివలింగాలకు పూజలు చేసి సోమవారం నుండి శనివారం వరకు ప్రతిరోజు భక్తులకు ఉచితంగా అన్నదానం కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని ఆలయ నిర్వాహకులు సోమబాబు తెలిపారు. ఈ కార్యక్రమం దాతల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరు అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని వారు కోరారు.