అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని అరవపల్లి గ్రామంలో వెలిసిన ప్రసన్న వీరాంజనేయ స్వామి ఆలయంలో శనివారం జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు ఆలయాన్ని రంగురంగుల విద్యుద్వీపాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. ప్రసన్న వీరాంజనేయ స్వామిని దర్శించుకున్న భక్తులకు తాము కోరిన కోరికలు వెంటనే నెరవేరుతాయన్న దృఢ సంకల్పం ఈ ఆలయం యొక్క విశిష్టత.