రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

3258చూసినవారు
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కర్నూలు - చిత్తూరు జాతీయ రహదారిలోని సంబేపల్లి మండలం మోటకట్ల విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో షేక్ బాబ్జి మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు రాయచోటి పట్టణం నాయాబ్ సాబ్ వీధి కి చెందిన బాబ్జి ద్విచక్ర వాహనం పై కలకడ వైపు నుండి రాయచోటికి వెళుతుండగా కలకడ కు చెందిన ఓ ప్రైవేట్ పాఠశాలకు చెందిన స్కూల్ బస్సు ఢీ కొనడంతో అక్కడకక్కడే మృతి చెందాడు. పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్