బైక్ను ఢీకొట్టిన డీసీఎం.. ముగ్గురి మృతి (వీడియో)
TG: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దేవరకొండలో ఓ బైక్ను డీసీఎం వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు దేవరకొండ మండలం తాటికొల్ గ్రామానికి చెందిన షేక్ హాజీ కుటుంబ సభ్యులుగా గుర్తించారు. మృతుల్లో ఇద్దరు పురుషులు, ఒక మహిళ ఉన్నారు. ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.