ఏపీలో ఈ నెల 10, 11 తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించాలని తొలుత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ తాజాగా ఆ తేదీలను మార్చేసింది. ఈ నెల 11, 12 తేదీల్లో రాష్ట్ర సచివాలయంలో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. మొదటి రోజు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలెక్టర్ల కాన్ఫరెన్స్ ఉద్దేశిస్తూ ప్రసంగించనున్నారు. రెండో రోజు ముగింపు సమయంలో కొత్త లక్ష్యాలను ఫిక్స్ చేస్తూ దిశానిర్దేశం చేయనున్నారు.