AP: బాలికపై అత్యాచారం కేసులో ఓ ఉపాధ్యాయుడికి ఒంగోలు పోక్సో కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. నిందితుడు షేక్ అప్సర్ బాషాకు మరణించే వరకూ జైలు శిక్ష విధించింది. రూ.25 వేల జరిమానాతో పాటు బాధితురాలికి రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 2017 ఆగస్టు 6న ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఈ ఘటనపై కేసు నమోదు కాగా తాజాగా తీర్పు వెలువడింది.