జగనన్న విదేశీ విద్యాదీవెన, జగనన్న సివిల్ సర్విసెస్ ప్రోత్సాహకాలను సీఎం జగన్ ఇవాళ లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయనున్నారు. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసిస్తున్న 390 మంది విద్యార్థులకు విదేశీ విద్యాదీవెన కింద రూ.41.6 కోట్లను అందిస్తారు. అలాగే
సివిల్స్ ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 95 మంది, వారిలో తిరిగి మెయిన్స్‌లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది అభ్యర్థులకు మొత్తం రూ.42.6 కోట్లను సీఎం జమ చేస్తారు.