AP: సోమవారం నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు. తర్వాత సభ మరుసటి రోజుకు వాయిదా పడనుంది. సభ వాయిదా పడ్డాక శాసన సభ, శాసన మండలి వ్యవహారాల సలహా కమిటీలు భేటీ కానున్నాయి. సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలని, ఏ రోజు ఏ అంశాలపై చర్చించాలనే ఎజెండాను ఖరారు చేస్తారు.