తిరుపతి జిల్లాలో దారుణం జరిగింది. చంద్రగిరి మండలం నాగయ్యగారిపల్లిలో దుండగులు రెచ్చిపోయారు. నిజగురు మఠం స్వామిజీపై దాడి చేశారు. దీంతో ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. అయితే తనపై ఏపీ అర్బన్ డెవలప్మెంట్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ డైరెక్టర్ ఊక విజయ్ కుమార్ అనుచరులు దాడి చేశారని స్వామీజీ తెలిపారు. మామిడి తోట కోసం రోడ్డును ధ్వంసం చేసి మట్టి తరలిస్తున్నారని ప్రశ్నిస్తే కర్రలు, రాళ్లతో దాడి చేశారని వాపోయారు.