కొరిశపాడు మండలంలోని ప్రజలందరూ 15 గ్రామ సచివాలయాల వద్ద జరుగుతున్న ఆధార్ క్యాంపు లను సద్వినియోగం చేసుకోవాలని ఎంపీడీవో సమతా వాణి బుధవారం మీడియా ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈనెల 27వ తేదీ వరకు ఆధార్ క్యాంపులు జరుగుతాయని ఆమె పేర్కొన్నారు. ఆధార్ కు మొబైల్ లింకు 50 రూపాయలు, ఆధార్ అప్డేట్ కు వంద రూపాయలు నిర్దేశించిన ఫీజులు చెల్లించాలని ఎంపీడీవో సమతా వాణి తెలియజేశారు.