కొరిశపాడు మండలం మేదరమెట్ల లో సింథైట్ ఫ్యాక్టరీ ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్యాక్టరీ ఆవరణం నందు మొక్కలు నాటే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో తాసిల్దార్ వెంకటేశ్వరరావు పాల్గొని మొక్కలు నాటారు. వృక్షో రక్షి రక్షితః అనే స్ఫూర్తితో యాజమాన్యం మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో డిటి మెహతాజ్, వీఆర్వో రాజశేఖర్, డైరెక్టర్ మహేంద్ర, హెచ్ఆర్ సలీంలు పాల్గొన్నారు.