సచివాలయం సిబ్బంది సమయాపాలన పాటించాలి

55చూసినవారు
సచివాలయం సిబ్బంది సమయాపాలన పాటించాలి
కోరిశపాడు మండలం, మేదరమెట్ల గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని శుక్రవారం చీరాల డివిజనల్ పంచాయతీ అధికారి దార. హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించారు. గ్రామంలో జరుగుతున్న పారిశుద్ధ్య పనులు, మంచినీటి సరఫరా మొదలగు విషయాల గురించి పంచాయతీ కార్యదర్శి లక్ష్మీకాంత్ ను అడిగి తెలుసుకున్నారు. సచివాలయం సిబ్బంది సమయాపాలన పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్