అమర వీరుడు రాంప్రసాద్ బిస్మిల్ 127వ జయంతి

77చూసినవారు
అమర వీరుడు రాంప్రసాద్ బిస్మిల్ 127వ జయంతి
బాపట్లలో సాహితీ భారతి ఆధ్వర్యంలో ప్రముఖ స్వాతంత్య్ర సమర, అమర వీరుడు రాంప్రసాద్ బిస్మిల్ 127వ జయంతి సభ మంగళవారం నిర్వహించారు. సాహితీ భారతి అధ్యక్షులు రావూరి నరసింహ వర్మ మాట్లాడుతూ రాంప్రసాద్ బిస్మిల్ దేశభక్తిని ప్రేరేపించే రచనలు చేశారని తెలిపారు. చంద్రశేఖర్ ఆజాద్, భగత్ సింగ్ వంటి అమరవీరులకు స్ఫూర్తి ప్రదాత అని కొనియాడారు. బిస్మిల్ హిందుస్థాన్ రిపబ్లికన్ అసోసియేషన్ అనే విప్లవ సంస్థను స్థాపించారన్నారు.

ట్యాగ్స్ :