ఆగస్టు 8న ఎన్నికలపై అవగాహన కార్యక్రమం

55చూసినవారు
ఆగస్టు 8న ఎన్నికలపై అవగాహన కార్యక్రమం
ప్రకాశం జిల్లా కొమరోలు మండల విద్యాశాఖ కార్యాలయంలో మండల విద్యాశాఖ అధికారి శుక్రవారం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. అతి త్వరలో జరగనున్న స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికలపై ఆగస్టు 8వ తేదీన ఉదయం 9 గంటల 30 నిమిషాలకు ప్రత్యేక సమావేశం కలదని ఈ సమావేశానికి ప్రతి ఒక్క ఉపాధ్యాయుడు తో పాటు పాఠశాల సిబ్బంది హాజరుకావాలని మండల విద్యాశాఖ అధికారి ఉపాధ్యాయులను ఆదేశించారు.

సంబంధిత పోస్ట్