మహిళలకు వడ్డీలేని రుణాలు - - ఏలూరి సాంబశివరావు

77చూసినవారు
మహిళలకు వడ్డీలేని రుణాలు - - ఏలూరి సాంబశివరావు
మహిళలను డ్వాక్రా సంఘాలుగా తీర్చిదిద్ది సంఘటితంగా మెలిగేలా వారి పట్ల ఉదారతను చాటింది చంద్రబాబు మాత్రమే అని పర్చూరు ఎమ్మెల్యే అభ్యర్థి ఏలూరి సాంబశివరావు అన్నారు.రాష్ట్రంలోని మహిళలను బృందాలుగా మార్చి, పొదుపుపై అవగాహన కల్పించింది తెదేపా అధినేత ఒక్కరే అని, వారి కాళ్లపై వాళ్లు నిలుచొని కుటుంబాలను పోషించుకునే స్థాయికి మహిళల్లో నైపుణ్యాలను వెలికితీశారన్నారు.. అప్పుడే సంఘాలు ఏర్పాటు చేయడమేకాక బ్యాంక్ లింకేజీ రుణాలు అందజేసి ఆద్యుడిగా నిలిచారన్నారు. ఇది చంద్రబాబు వేసిన ఫౌండేషన్ అని ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళా సంఘాలకు రూ.10 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందజేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు. అలాగే మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణించే పథకం అమలు చేయనున్నట్లు సాంబశివ రావు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you