కారంచేడు మండలానికి తాగునీరు విడుదల

58చూసినవారు
కారంచేడు గ్రామ పరిధిలోని చెరువులకు బుధవారం కొమ్మమూరు కాల్వ నుండి తాగునీరు విడుదలైంది. చాలాకాలంగా కారంచేడులో మంచినీటి చెరువులు ఎండిపోయి త్రాగునీరు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. తాగునీరు కోసం అధికారులను కలిసి త్రాగునీటి అవసరాలకు చెరువులను నీటితో నింపాలని కోరుతున్నారు. ఎట్టికేలకు తాగునీరు విడుదల కావడంతో ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

సంబంధిత పోస్ట్