విద్యుత్ దీపాల వెలుగులో ప్రభుత్వ కార్యాలయాలు

62చూసినవారు
విద్యుత్ దీపాల వెలుగులో ప్రభుత్వ కార్యాలయాలు
ఏపిలో ఎన్ డి ఏ కూటమి ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వం బుధవారం అధికారం చేపట్టనున్న సందర్భముగా ప్రభుత్వ కార్యాలయాలను మంగళవారం విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాల మేరకు రేపల్లె ఎంపీడీవో కార్యాలయానికి, తహసిల్దార్ కార్యాలయాలకు రంగురంగుల విద్యుత్ దీపాలను అధికారులు ఏర్పాటు చేశారు. రేపల్లె నియోజకవర్గం లోని అన్ని మండలాలలో ప్రభుత్వ కార్యాలయాలను అలంకరించారు.

సంబంధిత పోస్ట్