
చెరుకుపల్లి: పది పరీక్షకు 46 మంది విద్యార్థుల గైర్హాజరు
పదవ తరగతి సైన్స్ పరీక్షకు చెరుకుపల్లి మండలంలో 46 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు మండల విద్యాశాఖ అధికారి పులి లాజర్ తెలిపారు. చెరుకుపల్లి మండలంలోని నాలుగు పరీక్షా కేంద్రాలలో 629 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా కేవలం 583 మంది మాత్రమే పరీక్ష రాసినట్లు ఆయన తెలిపారు. పరీక్ష కేంద్రాలను మండల విద్యాశాఖ అధికారి లాజర్ బుధవారం తనిఖీ చేసి సంతృప్తి వ్యక్తం చేశారు.