రాజధానికి వరద ముప్పు ఉండదు: మంత్రి నారాయణ
అమరావతి రాజధాని ప్రాంతానికి వరద ముప్పు ఉండదని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. సోమవారం విజయవాడ సిఆర్ డి ఎ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కొండవీటివాగు, పాలవాగు, గ్రావిటీ కెనాల్ ద్వారా రాజధానికి వరద రాకుండా ప్రణాళిక రూపొందించామన్నారు. ఈఅంశంలో అసత్య ప్రచారాలను నమ్మనవసరం లేదన్నారు. గత వందేళ్ల వర్షపాత రికార్డులను పరిశీలించి ఎంతటి వర్షం వచ్చినా నీరునిల్వ ఉండకుండా రాజధాని నిర్మిస్తున్నామని చెప్పారు.