78వ స్వాతంత్ర దినోత్సవం పురస్కరించుకుని అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో స్వాతంత్ర్య సమరయోధుడు, కీ. శే, పావులూరి శివరామకృష్ణయ్య విగ్రహానికి మండల తహసిల్దార్, నెహ్రూ బాబు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం 2023 - 24 విద్యా సంవత్సరంలో మోపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన ఓలేటి హారిక కు తహసిల్దార్ ప్రోత్సాహంగా 3000 రూపాయలు ఆర్థిక సహాయం అందించారు.