ఏపీలో రేపు, ఎల్లుండి జాగ్రత్త
By Pavan 57చూసినవారుఏపీలో భానుడి భగభగలు ముందుగానే మొదలయ్యాయి. బుధవారం 58 మండలాల్లో, గురువారం 37 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSMDA పేర్కొంది. ప్రజలంతా వడదెబ్బ తగలకుండా టోపీ, గొడుగు, టవల్, కాటన్ దుస్తులు ఉపయోగించాలని సూచించింది. వృద్ధులు, గర్భిణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని, చెవుల్లోకి వేడిగాలి వెళ్లకుండా చూసుకోవాలని తెలిపింది. డీహైడ్రేట్ కాకుండా ORS, మజ్జిగ, కొబ్బరి నీళ్లు,నిమ్మకాయ నీళ్లు తాగాలని సూచించింది.