BREAKING: పేర్ని నానికి హైకోర్టులో ఊరట

2272చూసినవారు
BREAKING: పేర్ని నానికి హైకోర్టులో ఊరట
AP: మాజీ మంత్రి పేర్ని నానికి హైకోర్టులో ఊరట లభించింది. రేషన్ బియ్యం వ్యవహారానికి సంబంధించిన కేసులో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసులో ఆయన ఏ6గా ఉన్నారు. ఇప్పటికే పేర్ని నాని భార్యకు జిల్లా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది. మరోవైపు కాకినాడ సీ పోర్టు వ్యవహారంలో వైవీ విక్రాంత్ రెడ్డికి కూడా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చింది.