చెట్టును ఢీకొట్టిన కారు.. మహిళ మృతి (వీడియో)

65091చూసినవారు
అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చింతూరు-భద్రాచలం జాతీయ రహదారిపై వేగంగా వెళ్తున్న కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందగా.. మరో ఐదుగురు గాయపడ్డారు. క్షతగాత్రులను ఏడుగురాల్లపల్లి ఆస్పత్రికి తరలించారు. వీరంతా కృష్ణా జిల్లా గంపలగూడెం వాసులుగా పోలీసులు గుర్తించారు. మారేడుమిల్లి వెళ్లి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

సంబంధిత పోస్ట్