ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం వ్యూహాత్మక నిర్ణయాలు అమలు చేస్తోంది. జగన్ తన సక్సెస్ గా చెప్పుకున్న పెన్షన్ల పంపిణీ ఇప్పుడు చంద్రబాబు తన మార్క్ గా మార్చుకుంటున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాల ప్రకారం పెన్షన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గం పెనుమాక గ్రామంలో జరిగే పంపిణీలో స్వయంగా ముఖ్యమంత్రే పాల్గొనున్నారు. దీంతో జగన్‌కు చంద్రబాబుకు చాలా తేడా ఉందని టాక్ నడుస్తోంది.