AP: సంక్రాంతి సెలవులపై కూటమి ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. విద్యాసంస్థలకు జనవరి 10 నుంచి 19 వరకు సంక్రాంతి సెలవులు ఉంటాయని ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. వర్షాల కారణంగా పలు జిల్లాల్లోని పాఠశాలలకు సెలవులు ఇచ్చినందుకు ఈ సారి 11-15 లేదా 12-16 తేదీల్లో సంక్రాంతి సెలవులు ఉంటాయని వస్తున్న వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చారు. సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు.