ఏపీ సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి స్టేట్ గెస్ట్‌గా
మెగాస్టార్ చిరంజీవి రానున్నారు. ఇవాళ సాయంత్రానికే ఆయన విజయవాడ చేరుకుని అక్కడే బస చేయనున్నారు. చిరంజీవితో పాటు మెగా ఫ్యామిలీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి వస్తారని సమాచారం. మరోవైపు ప్రధాని నరేంద్ర
మోదీ, హోంమంత్రి అమిత్ షా కూడా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.