సాయి మాతా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రత పూజలు

72చూసినవారు
సాయి మాతా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రత పూజలు
కుప్పం సాయి మాతా సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎం. ఎఫ్. సీ ప్రభుత్వ జూనియర్ కళాశాల అవరణలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం పూజలు ఘనంగా నిర్వహించారు. కళాశాలలోని విద్యార్థినిలు, మహిళా అధ్యాపకులు, మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆదరించారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో 400 మందికి పసుపు కుంకుమలు, రవికలు, తాంబూలం పంపిణీ చేశారు. వరలక్ష్మి కటాక్షం ఎల్లవేళలా ప్రజలపై ఉండాలని ట్రస్ట్ చైర్మన్ జగదీష్ బాబు కోరారు.

సంబంధిత పోస్ట్