పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలోని ఎస్ కే విన్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో గురువారం అంగరంగ వైభవంగా 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కళాశాల వ్యవస్థాపకులు కొల్లా వెంకట రామనాయుడు కుమారుడు కోటేశ్వరయ్య, ఎస్సై శివ శంకర్, బిజెపి నియోజకవర్గ కన్వీనర్ ధర్నా మదన్మోహన్ బాబు విచ్చేశారు. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ గంగాధరమ్ నాయుడు ఆధ్వర్యంలో జరిగింది.