ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు

79చూసినవారు
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చర్యలు
రానున్న సార్వత్రిక ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ముందు జాగ్రత్త చర్యలను తీసుకున్నట్లు ఎస్సై వెంకట నర్సింహులు తెలియజేశారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గం సోమల మండలం కందూరు బస్టాండులో కేంద్ర బలగాలతో కవాతు, సమావేశాన్ని ఆదివారం నిర్వహించారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎస్సై తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్