తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎ. రంగంపేటలోని మోహన్ బాబు యూనివర్సిటీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొన్న విషయం తెలిసిందే. మంచు మనోజ్ దంపతులకు యూనివర్సిటీలోకి రాకుండా అక్కడ కొందరు అడ్డుకున్నారు. ఎట్టకేలకు పోలీసుల అనుమతితో మంచు మనోజ్ దంపతులు యూనివర్సిటీలోకి ప్రవేశించారు. తన నానమ్మ, తాతయ్య సమాధుల వద్దకు వెళ్లారు. వారికి నివాళులు అర్పించారు. తర్వాత బయటకు వచ్చేశారు.