చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ఆయన సతీమణి పులివర్తి సుధారెడ్డిలు సోమవారం విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరిని మర్యాదపూర్వకంగా కలిశారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 12న ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో విజయవాడకు చేరుకున్న ఎమ్మెల్యే పులివర్తి నాని దంపతులు నారా భువనేశ్వరిని కలిసి ముందస్తు శుభాకాంక్షలు తెలిపారు.