చిత్తూరు జిల్లా విజయపురం మండలం మల్లారెడ్డి కండ్రిగకు చెందిన వెంకటయ్య, లత (48) భార్యాభర్తలు. లత, గత నెల 22వ తేదీకి కనకమ్మసత్రంలో నకిలీ నగల కుదువ పెట్టారు. 29 గ్రాముల బంగారు నగలను కుదువపెట్టి రూ.1.25 లక్షలు తీసుకున్నారు. 3రోజుల క్రితం మరో 20 గ్రాముల నగలను కుదువపెట్టి రూ.90 వేలు తీసుకున్నారు. అనుమానంతో, దుకాణ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేయగా. లతను అరెస్టు చేసి దర్యాప్తు ప్రారంభించారు.