విషం తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం

61చూసినవారు
విషం తాగి వివాహిత ఆత్మహత్యాయత్నం
కుటుంబ సమస్యలతో ఓ వివాహిత విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు నిమ్మనపల్లె ఎస్సై లోకేశ్ రెడ్డి సోమవారం తెలిపారు. మండలంలోని రాచవీటివారిపల్లె పంచాయతీ, గొల్లపల్లెకు చెందిన అశ్విని (23) ఇంట్లో సమస్యల కారణంగా పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబీకులు ఆమెను చికిత్స కోసం వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు వైద్యం అందించడంతో ఆమె కోలుకుంటుంది.

సంబంధిత పోస్ట్