స్మశానాన్ని ఆక్రమించాలి అనుకోవడం హేయమైన చర్య అని పుల్లంపేట సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి అన్నారు. మంగళవారం పుల్లంపేటలో ఆయన మాట్లాడుతూ గుర్తు తెలియని వ్యక్తులు స్మశానం ప్రహరీ గోడను కూల్చివేయడం తీవ్రమైన చర్యగా భావించి పోలీసులు విచారించి వారిని అరెస్టు చేయాలని కోరారు. హిందూ స్మశానం గోడ కూల్చడంలో పార్టీల ప్రమేయం లేదన్నారు. స్మశానం రక్షణకు అందరూ సహకరించాలన్నారు.