టిడిపి కార్యకర్తలు సంయమనం పాటించాలి : ఆర్.జె. వెంకటేష్

59చూసినవారు
టిడిపి కార్యకర్తలు సంయమనం పాటించాలి : ఆర్.జె. వెంకటేష్
4 వ తేదీ జరగబోవు ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా మదనపల్లి నియోజకవర్గ టిడిపి పార్టీ నాయకులు, కార్యకర్తలు సంయమనం పాటించాలని నిమ్మనపల్లి సర్కిల్ నందు తన కార్యాలయంలో సోమవారం ఉదయం రాజంపేట పార్లమెంటరీ అధికార ప్రతినిధి ఆర్ జే వెంకటేష్ అన్నారు. ప్రతి రౌండ్లో వెలువడేనటువంటి ఎన్నికల ఫలితాల సందర్భంగా ప్రతిపక్ష నాయకులు కవ్వింపు చర్యలకు పాల్పడ వచ్చునని, అలాంటి సందర్భంలో కార్యకర్తలు తమ సహనాన్ని కోల్పోకుండా చట్టానికి లోబడి ఉండాలని కోరారు. రానున్న ఫలితాల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడం, రాష్ట్రంలో చంద్రబాబు ముఖ్యమంత్రి పగ్గాలు చేపట్టడం తద్యమని ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రశాంతత వాతావరణంలో విజయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆస్వాదించాలని ప్రతి కార్యకర్తను, నాయకుడికి, అభిమానులకు ఆర్. జె. వెంకటేష్ కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్