అసలే నీవర్ తుఫాన్ వల్ల నష్టపోయి రైతు భాధలో వుంటే మిగిలి వున్న ఆపంటను ఏనుగుల గుంపు నాశనం చేశాయి అంటూ రైతులు బాధ పడుతున్నారు వివరాల్లోకి వెళితే గంగవరం మండలం కొత్తపల్లి గ్రామంలోని ఏర్రయ్యగారి పల్లి వంక పంట పొలాల్లో శుక్రవారం రాత్రి ఏనుగులు దాడి చేసి రైతు శ్రీధర్ కి చెందిన టమోట మరియు వరిపంటల ను తీవ్రంగా నష్ట పరిచాయి మూడు నెలల క్రితం ఇలాగే చేతికి వచ్చిన టమోట పంట పై కూడా ఏనుగులు ఇలాగే దాడి చేసి తీవ్రంగా నష్టం చేశాయని అప్పుడు కూడా ఇటు ప్రభుత్వానికి మరియు ఫారెస్ట్ వారికి తన భాదను విన్నవించు కున్నానని ఆదుకొలేదని కనీసం ఇప్పుడైనా పంట నష్టాన్ని పరిగణలోకి తీసుకోవాలని రైతులు వేడుకుంటున్నారు.