బస్సు పాసుల పంపిణీకి రెండు రోజులు విరామం

63చూసినవారు
బస్సు పాసుల పంపిణీకి రెండు రోజులు విరామం
జూన్ 6, 7 తేదీల్లో ఆర్టీసీ రాయితీ బస్సు పాసుల పంపిణీని రద్దు చేసినట్లు పీలేరు ఆర్టీసీ డిపో మేనేజర్ బండ్ల కుమార్ సోమవారం తెలిపారు. బస్సు పాసుల మాడ్యూల్ సర్వర్ అప్ గ్రేడ్ చేస్తున్నందున పై తెలిపిన రెండు రోజులూ ఎలాంటి బస్సు పాసులు పంపిణీ చేయడం జరగదని తెలియజేశారు. తిరిగి 8వ తేదీ నుంచి పాసుల పంపిణీ కార్యక్రమం పునః ప్రారంభం అవుతుందని చెప్పారు. లబ్ధిదారులు ఈ అసౌకర్యాన్ని గుర్తించి తమతో సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్