రాజకీయ దాడులు సహించం: డిఎస్పీ

75చూసినవారు
రాజకీయపరమైన దాడులు చేస్తే సహించేది లేదని డీఎస్పీ విష్ణు రఘువీర్ మంగళవారం స్పష్టం చేశారు. వికోట పోలీస్ స్టేషన్ లో ఆయన మాట్లాడుతూ, ఇతర పార్టీలకు చెందిన జెండా దిమ్మలు, విగ్రహాలు, నాయకుల ఇళ్లపై దాడులు చేయడం తగదన్నారు. దాడులకు పాల్పడితే ఎటువంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. సీఐ లింగప్ప, ఎస్ఐ బాబు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్