సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామాల్లో ఎక్కడైనా కోడి పందెం, పేకాటలు ఆడితే క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టులు చేస్తామని బంగారుపాలెం సీఐ కత్తి శ్రీనివాసులు తెలిపారు. మండలంలో సంక్రాంతి పండుగను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. పోలీసులతో గ్రామాల్లో ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. పండుగకు వేరే ఊళ్లకు వెళ్లే వారు తప్పక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.