పిచ్చాటూరు సచివాలయ పరిధిలో వాలంటీర్లు శుక్రవారం మూకుమ్మడిగా రాజీనామా చేశారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకుని తమ రాజీనామా పత్రాలను ఏఓ రాధా రాణికి సమర్పించారు. వాలంటీర్లు మాట్లాడుతూ ప్రజలకు అంకిత భావంతో సేవలు అందిస్తున్న తమను తెలుగుదేశం, జనసేన పార్టీలు కించపరిచేలా మాట్లాడడం జీర్ణించుకోలేక రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.