తడ మండలంలోని మాంబట్టు పారిశ్రామిక వాడ పరిధిలో కొన్ని కంపెనీలకు చెందిన వేస్ట్ డంపింగ్ యార్డులో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. చుట్టుపక్కల ఉన్న కంపెనీలకు చెందిన కార్మికులు, గ్రామస్తులు మంటలు చూసి భయాందోళన గురయ్యారు. అగ్నిమాపక శాఖ అధికారులు మంటలు అదుపు చేసేందుకు చర్యలు చేపట్టారు. యార్డులో ఎవరూ లేని సమయంలో ప్రమాదం జరగడంతో ఏటువంటి నష్టం జరగలేదు.