విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలి: ఏఓ రమణ కుమార్

74చూసినవారు
విత్తన శుద్ధి చేసుకుని విత్తుకోవాలి: ఏఓ రమణ కుమార్
విత్తన శుద్ధి చేసుకుని వేరుశెనగ విత్తుకోవాలని తంబళ్లపల్లె ఏఓ రమణ కుమార్ సోమవారం అన్నారు. ఖరీఫ్ వేరుసెనగ సాగు చేసే మండల రైతులకు ఏఓ పలు సూచనలు చేశారు. వేరుసెనగ పంటలో అంతర పంటలుగా కంది, అలసంద వేసుకోవాలని సూచించారు. వేరుసెనగ విత్తిన నెల రోజుల తరువాత ఎకరాకు 200కిలోల జిప్సం వేసుకుంటే భూసారం పెరగడంతో పాటు మొక్కకు సూక్ష్మ ఖనిజ పోషకాలు బాగా అందుతాయన్నారు. దీంతో ఆశించిన పంట దిగుబడి సాధించవచ్చన్నారు.

సంబంధిత పోస్ట్