తంబళ్లపల్లె ప్రభుత్వ ఐటీఐలో 7న నిరుద్యోగ యువతీ యువకులకు జాబ్ మేళా నిర్వహించనున్నట్టు ప్రిన్సిపల్ శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. తిరుపతి, బెంగళూరు, హైదరాబాద్ నుంచి ప్రముఖ కంపెనీలు హాజరవుతారన్నారు. పది, ఐటీఐ, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులన్నారు. ఆసక్తి కలవారు ఆధార్ కార్డు, పాస్ పోర్టు సైజు ఫోటోలు, విద్యార్హత ధ్రువపత్రాలు, బయోడేటాతో ఐటీఐ వద్దకు రావాలన్నారు.