పట్టణంలోని మున్సిపాలిటీ కార్యాలయంలో గురువారం జరిగిన కౌన్సిల్ సమావేశంలో 7వ వార్డు కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి వాకౌట్ చేశారు. కౌన్సిలర్ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ 7వ వార్డులో ఇంతవరకు ఏ పనులు చేశారో తెలియజేయాలన్నారు. పనుల విషయాలపై పలు కౌన్సిల్ సమావేశాల్లో అడిగితే సమాధానం లేదన్నారు. ఈసారి కౌన్సిల్ సమావేశంలో తాను అడిగిన ప్రశ్నకు సమాధానం లేకపోతే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తామన్నారు.