ఏపీలో మహిళలకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఉచిత సిలిండర్ల పథకానికి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. 'దీపావళి కానుకగా దీపం పథకం కింద ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లను ఈ నెల 31 నుంచి అందిస్తాం. ఈ నెల 24 నుంచి బుకింగ్ చేసుకునే ఏర్పాట్లు చేస్తున్నాం. ఏడాదికి రూ. 2,684 కోట్ల ఖర్చుతో ఈ పథకాన్ని అమలు చేస్తున్నాం. సిలిండర్ తీసుకున్న రెండు రోజుల్లో లబ్ధిదారులు బ్యాంకు ఖాతాల్లో గ్యాస్ సబ్సిడీ సొమ్ము జమ చేస్తాం' అని చంద్రబాబు ప్రకటించారు.